Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

సాంకేతిక రంగంలో  సమూల మార్పులే దేశ అభివృద్ధిలో కీలక పాత్ర

విశాలాంధ్ర -జె ఎన్ టి యుఏ : ఆధునిక ప్రపంచంలో నిరంతరం సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటున్న దేశాల యొక్క అభివృద్ది ఆధార పడిందని పివికేకే డిగ్రీ , పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డా వై మునికృష్ణా రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం  నగరంలోని పివికేకే డిగ్రీ , పీజీ కళాశాలలో సైన్స్ దినత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం డిజిటల్ ఇండియాగా పరిణామం చెందడం చాలా అవసరం అని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ప్రణాళికలు సిద్దం చేయడం సంతోషకరం అన్నారు. కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ధనుష్ మాట్లాడుతూ. విద్యార్థి దశ నుంచే నూతన ఆవిష్కరణల వైపు కృషి చేసి అవి కలకలం నిలిచేలా కృషి చేయాలన్నారు. బోటని హెచ్ ఒ డి డా పి సుశీల . 2023 ఏడాది థీమ్ గురించి విద్యార్థులకు వివరించారు. బోటని విద్యార్థినులు షాహిన్, హరిత సైన్స్ దృష్టిలో చిరుధాన్యాలు అవశ్యకత పై విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన పోస్టర్లను పరిశీలించి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో  అధ్యాపకులు డా వై.సి పుల్లన్న, డా.సంజీవ, సుర్యలక్ష్మి, లక్ష్మి ప్రసన్న, మహేష్ బాబు, స్వాతి , దామోదర్ నాయుడు, శ్రీనివాస రావు, విద్యార్దిని విద్యార్దులు పాల్గొన్నారు.           

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img