Monday, June 5, 2023
Monday, June 5, 2023

సిపిఐ ఆధ్వర్యంలో ప్రజల మేలుకొలుపు పాదయాత్రలు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రత వైఖరికి నిరసనలు

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ పట్టణము నందు శుక్రవారం ఎం క్యు ఏ సమావేశ భవనమునందు సిపిఐ కార్యకర్తల సమావేశం నిర్వహించారు సిపిఐ డివిజన్ కార్యదర్శి శ్రీ రాముల ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ సిపిఐ రాష్ట్ర మహాసభ సమావేశాలలో తీర్మానాల మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు పోలవరం ప్రాజెక్టు 48 మీటర్ల ఎత్తు ఉన్న ప్రాజెక్టును ఇప్పుడు 41 మీటర్లకు తగ్గించాలని కేంద్రము భావిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం నోరు ఇప్పడం లేదు పోలవరం నిర్మాణానికి 196 కోట్లు మొత్తం అవసరం కాగా 92 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తామనగానే రాష్ట్ర ప్రభుత్వము నోరు మెదపడం లేదు ఈ ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వలన జాతీయ హోదా పోయి మినీ ప్రాజెక్టుగానే మిగిలిపోతుందని అలాగే కర్ణాటక రాష్ట్రంలో ఎగువ భద్ర డ్యామ్ కు జాతీయ హోదా కల్పించి బిజెపి తన యొక్క ఎన్నికల ప్రేమను చూపించిందని ఈ డ్యామ్ వలన అనంతపురం జిల్లాకు మరియు రాయలసీమకు రావలసిన జలాలు పూర్తిగా తగ్గిపోతాయని దీనివలన పి ఎ బి ఆర్ కర్నూలు సుంకేసుల హెచ్ ఎల్ సి ఎల్ ఎల్ సి కాలువ వలన లక్షల ఎకరాల భూమి కి నీరు లేకుండా పోతుందని దీనివలన 26 జిల్లా కేంద్రాలలో రిలే నిరాహార దీక్షలు సిపిఐ నిర్వహించగా హుటాహుటిన ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన వెళ్లి ఒట్టి చేతులతో తిరిగి రావడం వలన రాష్ట్రానికి అనేక అన్యాయాలు జరుగుతున్నాయని కనీసం రాయలసీమ బిజెపి నాయకులు దీనిమీద ఏమీ మాట్లాడకపోవడం రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై బిజెపి నాయకులు నోరు మెదక్ మెదపకపోవడం సూచనీయమని ఆయన బిజెపి నాయకులపై ధ్వజమెత్తారు ఆంధ్ర రాష్ట్రంపై సవతి ప్రేమ చూపిస్తున్నారని బిజెపి నాయకులు రాష్ట్రం పట్ల అప్రమత్తంగా లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు పోలవరం నిర్వాసితులకు 20 నుంచి 30 వేల కోట్లు ఖర్చుకాగా 10 వేల కోట్ల మాత్రమే కేంద్రాన్ని సాయం అందిస్తుందని వాటిపై కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడం లేదని అలాగే ఈనెల 14వ తేదీ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకు సత్వ వైఖరినే నిరసిస్తూ గ్రామ గ్రామాన పాదయాత్ర నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేయాలని పార్టీ నిర్ణయించిందని ఆంధ్ర రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆంధ్ర బ్యాంకు ను యూనియన్ బ్యాంకు లో విలీనం చేయడం అలాగే అనేక కార్పొరేట్ వ్యవస్థలను ఆదాని అంబానీ లకు కట్టబెట్టడం పాల ఫ్యాక్టరీలను అమూల్ కంపెనీలకు కట్టబెట్టడం వలన గుజరాతీయుల మీద ఉన్న ప్రేమ ఆంధ్రప్రదేశ్ మీద లేదని అలాగే ఆదాని అంబానీ ఆస్తులు కరోనా సమయంలో కూడా నూటికి నూరు శాతం లాభాలు సంపాదించినట్లు లెక్కలు తెలుపుతున్నాయి ఇప్పుడు మరల ఫోన్ పే గూగుల్ పే వంటి సమస్యలకు కూడా టోల్ గేట్ ఫీజులు అనేక రకాలుగా పెంచి దేశ సంపద కార్పొరేట్ సంస్థలకు చేరుతుందని బిజెపి ప్రభుత్వం చేపట్టక మునుపు పెట్రోలు డీజిల్ ధరలు తక్కువగా ఉండేవని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బ్యారల్ క్రూడ్ ఆయిల్ దర 110 డాలర్లు ఉండగా పెట్రోల్ డీజిల్ 60 రూపాయలకు అమ్మేవారు ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర బేరల్ 60 రూపాయలు ఉండగా డీజిల్ పెట్రోల్ ధరలు 110 రూపాయలుగా ఉన్నాయని కేంద్ర శుంకాలు విపరీతంగా పెంచడం వలన నూటికి 80 శాతం మంది పేద ప్రజల యొక్క సొమ్ము కార్పొరేటర్ వ్యవస్థల్లోకి మళ్ళిస్తున్నారని రాయలసీమకు మరియు ఉత్తరాంధ్రకు బుద్ధిల్ ఖండ్ తరహా ప్రత్యేక హోదా లేకుండా చేశారని వెనకడ పడిన ప్రాంతాలకు అభివృద్ధి కోసం నిధులు కేటాయించలేదని విశాఖ రైల్వే జోన్లేదని 13 కేంద్ర ప్రభుత్వ సంస్థలు నెలకొల్పుతామని హామీ ఇచ్చారని వాటి యొక్క హామీ నెరవేర్చలేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క నిరంకుశ వైఖరి నిరసిస్తూ ప్రజలను మేల్కొల్పడానికి సిపిఐ సిపిఎం కలసి ఈ పాదయాత్ర నిర్వహించబడునని అలాగే ఈనెల 13 14 15వ తేదీలలో లేపాక్షిలో సిపిఐ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించబడునని ఈ కార్యక్రమానికి సిపిఐ ఏఐటీయూసీ ఏఐఎస్ఎఫ్ నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటేశులు, నరసింహ, మల్లికార్జున, వెంకట్ రాముడు, శాంతమ్మ,కిష్టప్ప, ఇతర మండలాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img