Friday, March 31, 2023
Friday, March 31, 2023

సిపిఐ కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఈ నెల 28 న ఉచిత వైద్య శిబిరం…

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలోని 26వ వార్డు సిపిఐ కౌన్సిలర్ బోయలక్ష్మి, సిపిఐ నియోజవర్గం సహాయ కార్యదర్శి బి.మహేష్, పాత గుంతకల్లు హమాలీల ఆధ్వర్యంలో ఈనెల 28వ తారీకు మంగళవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు అన్ని రకాల రోగులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ హాజరవుతారని తెలిపారు.వైద్యులు డాక్టర్ ఎం.విక్రమ్ ,డాక్టర్ ఎంఎస్ మహేష్ అన్ని రకాల రోగులకు వైద్య చికిత్స అందించునని తెలిపారు .అదేవిధంగా బ్లడ్ గ్రూపు షుగర్ టెస్ట్ బిపి ఈసీజీ కూడా చికిత్స చేయబడును అని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img