Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

సీజనల్ వ్యాధులపై అవగాహన ర్యాలీ

విశాలాంధ్ర-బొమ్మనహళ్: మండలంలోని గోనెహళ్ గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యాధికారి గీత భార్గవి ప్రజలకు అవగాహన కల్పించారు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం సీజనల్ వ్యాధులపై విద్యార్థులతో ర్యాలీ ద్వార అవగాహన కల్పించటం జరిగింది. వ్యక్తి గత పరిశుభ్రత పాటించమని ,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోమని, నీటి డ్రమ్ములపై మూతలు పెట్టుకోవాలని, వారంకు ఒకసారి డ్రై డే పాటించమని ,రాత్రి వేళల్లో దోమతెరలు వాడాలని , డెంగీ మలేరియా వైరల్ జ్వరాలు రాకుండ పై నియమాలు పాటించాలని ప్రజలకు తెలియ జేయటం జరిగింది. ఈ కార్య క్రమంలో ప్రధానోపాధ్యాయుడు హనుమంతప్ప ఎం ఎల్ హెచ్ పి గౌతమి,ఆరాగ్యకార్యకర్త వెంకట రమణ, ఆశ వర్కర్లు లావణ్య,సరళ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img