Friday, March 31, 2023
Friday, March 31, 2023

సేవా కార్యక్రమాలు భగవంతుని సేవతో సమానం…

శ్రీ సత్య సాయి భజన మండలి ప్రతినిధులు
విశాలాంధ్ర- ధర్మవరం : సేవా కార్యక్రమాలు భగవంతుని సేవతో సమానమని శ్రీ సత్య సాయి భజన మండలి ప్రతినిధులు సాంబశివుడు, శేషాచారి, నాగిరెడ్డి, వినోద్, కాకుమాని సాగర్ లు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 6 గంటలకు రోగులకు సహాయకులకు దాదాపు 200 మందికి పాలు, బ్రెడ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తులసమ్మ వివాహ సందర్భంగా ఈ సేవా కార్యక్రమానికి దాతగా వ్యవహరించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు చేపట్టడం మాకెంతో సంతోషాన్నిస్తోందని తెలిపారు. తదుపరి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ పద్మలత వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img