Monday, February 6, 2023
Monday, February 6, 2023

సొంత చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ఏ మేర న్యాయం చేస్తాడు?

విశాలాంధ్ర`బ్రహ్మసముద్రం : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కుటుంబంలో ఒకరైన చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాడని మాజీ శాసనసభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్న హనుమంతరావు చౌదరి ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన వ్యక్తిగత కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు జగన్‌ కు చంపపెట్టుగా మారిందని స్వయానవా వివేకానంద కూతురు ఈ రాష్ట్రంలో న్యాయం జరగదని సొంత వారి అడ్డుపడుతున్నారని సుప్రీంకోర్టు ను ఆశ్రయించగా విచారించిన సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేసింది. అమరావతి విషయంలో కూడా మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య జగన్‌ చిచ్చు పెట్టడం వాస్తవం కాదా అని వారు ప్రశ్నించారు. వైకాపా నాయకులు మాటలు విని ఏడవలేక యావత్‌ రాష్ట్ర ప్రజలు వైకాపా ప్రభుత్వం పై నవ్వుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివ శంకర్‌ డీకే ్షమాంజనేయులు, పాలమండ్ల తిప్పారెడ్డి, రాయల శ్రీనివాసులు, గోళ్ళ వెంకటేశులు, గాజుల శ్రీరాములు ,గోవింద్‌ రెడ్డి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img