విశాలాంధ్ర – ఉరవకొండ : ఉరవకొండ మండలం రేణిమకులపల్లి గ్రామంలో గతంలో ఎప్పుడో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని వాటిని మార్చాలని సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు అనేకమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో ప్రజల యొక్క క్షేమం కోరి గ్రామ సర్పంచ్ బోయ రామాంజనేయులు శుక్రవారం శిథిలావస్థకు చేరుకున్న విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో సొంత నిధులు ఖర్చుపెట్టి స్తంభాలను ఏర్పాటు చేశారు.సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్తులు సర్పంచ్ రామాంజనేయులుకు కృతజ్ఞతలు తెలిపారు.