Saturday, February 4, 2023
Saturday, February 4, 2023

స్టార్‌ డయాగ్నస్‌ సెంటర్‌ కు నోటీస్‌ జారీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ

విశాలాంధ్ర-అనంతపురం వైద్యం : జిల్లా ఇంఛార్జి వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. యుగంధర్‌ ఆదేశాల మేరకు స్థానిక సూర్య నగర్‌ రోడ్డు నందు నిర్వహిస్తున్న స్టార్‌ డయాగ్నస్టిక్స్‌ మీద ఆరోపణలు వచ్చాయి. జమ్మలమడుగు చెందిన ప్రకాష్‌ రెడ్డి అనే వ్యక్తి ఆరోగ్య సమస్యకు సంబంధం లేని పరీక్షలు జరిపి అధికంగా డబ్బులు వసూలు చేశారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ విషయం మీద కార్యాలయం నుండి మాస్‌ మీడియా విభాగ సిబ్బంది మంగళవారం వెళ్లి స్టార్‌ డయాగ్నస్టిక్‌ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి రెండు రోజుల్లోగా ఫిర్యాదు మీద వివరణ ఇవ్వవలసిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డెమో త్యాగరాజు, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img