Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

స్త్రీ , పురుష సమానత్వానికి పోరాడుదాం !

ప్రభుత్వ డాక్టర్ సుజాత…

విశాలాంధ్ర-గుంతకల్లు : ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడబ్ల్యూ) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవం సందర్బంగా శనివారం రామిరెడ్డి కాలనీలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా పిఓడబ్ల్యూ నియోజకవర్గం కార్యదర్శి ఆశాబీ వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులు ప్రభుత్వ డాక్టర్ సుజాత పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా మహిళలు పౌష్టికాహారం లోపం వలన ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.గర్బినిలు తమకు పుట్టబోయే పిల్లలు ఎవరని లింగ నిర్ధారణ పరీక్షలను జరపాలని చాలామంది కోరుకుంటున్నారని అన్నారు. కానీ చట్ట ప్రకారం ఆ విధంగా చేయడం నేరమని వారి ప్రయత్నాలు విరమించుకోవాలని తెలిపారు.మహిళలకు చదువు ద్వారానే సమాజంలో గౌరవము, విలువ, స్వతంత్రంగా బతకడానికి అవకాశాలు ఉంటాయని తెలిపారు.తర్వాత పిఓడబ్ల్యూ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మణి మాట్లాడుతూ సమాజంలో అన్ని రంగాలలో స్త్రీల పట్ల వివక్షత, అణిచివేత కొనసాగుతున్నదని , సినిమా , టీవీలలో స్త్రీలను విలాస వస్తువుగా, అర్థనగ్నంగా చూపెడుతూ స్త్రీల యొక్క గౌరవాన్ని దిగజార్చడం జరుగుతున్నదన్నారు.మహిళలు , విద్యార్థుల మీద జరుగుతున్న హింస , యు టీజింగ్ ను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమై అనేకమంది విద్యార్థులు మరణించిన ప్రభుత్వాలు వారిని కఠినంగా శిక్షించడం లేదన్నారు. మహిళల మీద జరుగుతున్న హింసను అరికట్టడానికి అనేక చట్టాలు తీసుకుని వస్తున్నాయాని ప్రభుత్వాలు తెలుపుతున్న మహిళల మీద మాత్రం హింస ఆగడం లేదన్నారు. మద్యపానం వల్లనే అనేక కుటుంబాలు సర్వనాశనమవుతున్నాయని దీనివలన మహిళలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు.ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే మహిళలు ఐక్యంగా నిరంతరం పోరాడాలన్నారు.ఈ ఐ ఎఫ్ టి యు గుంతకల్లు నియోజకవర్గం కార్యదర్శి చిన్నా , జిలాన్ , చైల్డ్ లైన్ ఆర్గనైజర్ భాగ్యలక్ష్మి , అంగన్వాడి టీచర్ పార్వతి , ఆశా వర్కర్ రెహనా , పి ఓ డబ్ల్యు పట్టణ కమిటీ కార్యదర్శి మాౠనీ , వెంకటలక్ష్మి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img