Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

స్వతంత్రం కోసం పోరాడిన అమరులను మరవరాదు

15వ వార్డు సభ్యులు వసకేరి మల్లికార్జున

భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడానికి కృషిచేసిన అమరులు యొక్క త్యాగాలను ఎవరు కూడా మరువరాదని అలాంటి వారిని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ 15వ వార్డు సభ్యులు వసికేరి మల్లికార్జున అన్నారు. 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా గురువారం స్థానిక శివరామిరెడ్డి కాలనీలో ప్రభుత్వ పాఠశాలలో ఎంబీసీ రాష్ట్ర డైరెక్టర్ జోగి వెంకటేశులు తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన జాతీయ జెండాకు వందనం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర స్ఫూర్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రూపకల్పన చేశారని అని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు మల్లికార్జున బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శివప్రసాద్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img