విశాలాంధ్ర -ధర్మవరం : ఇటీవల ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలను నిర్వహించడం జరుగుతున్నది.. ఇందులో భాగంగా కొన్ని రోజుల కిందట పట్టణంలోని కొత్తపేటలో గల మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్లో కంటి పరీక్షలను నిర్వహించారు. తదుపరి కంటి దోషం ఉన్నవారు 44 మంది విద్యార్థినీలకు 38వ వార్డు కౌన్సిలర్ షేక్ శంషాద్ బేగం, వాడి ఇంచార్జ్ షేక్ షాన్ భాష, హెచ్ఎం మేరీ వర కుమారి చేతులమీదుగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. అనంతరం కౌన్సిలర్ మాట్లాడుతూ చదువుకునే పిల్లలకు కంటి దోషం ఉండకుండా ప్రభుత్వం ఉచిత పరీక్షలతో పాటు ఉచితంగా అద్దాలను ఇస్తూ వారి విద్యా దశను అభివృద్ధి పరచడం నిజంగా సంతోషదాయకం అని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రిక, సి ఓ మారుతి కుమార్, ఆశా వర్కర్ సులోచన ఏఎన్ఎం గంగాభవాని, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.