Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 13, 2024
Friday, September 13, 2024

హోమాలతో మారుమోగిన సంప్రోక్షణ వేడుకలు..

ఆలయ ఈవో వెంకటేశులు, ఆలయ చైర్మన్ చిలిపి పర్వతయ్య
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని ప్రముఖ మహిమగల శ్రీ దుర్గమ్మ దేవత దేవస్థానంలో ఈనెల 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు మూడు రోజులు పాటు సంప్రోక్షణ మహోత్సవ వేడుకలు ఆలయ ఈవో వెంకటేశులు, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సిరిపి పర్వతయ్య, దాతల, భక్తాదులు సహకారంతో నిర్వహించబడుతున్నాయి. ఇందులో భాగంగా రెండవ రోజు శుక్రవారం దుర్గమ్మ తల్లిని ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు, వివిధ ఆభరణాలతో అలంకరించి, ప్రత్యేక పూజలను అర్చకులు నిర్వహించారు. ఈ వేడుకకు ఆలయ కమిటీ వారు మేరకు తిరుమల తిరుపతి వేద పాఠశాల నుండి రామకృష్ణ శర్మ, పనింద్ర ,సురేష్, రవీంద్రనాథ్, నాగసాయి, లోకనాథ శర్మ, శ్రీ చంద్ర న్ లచే వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ, సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. అనంతరం పంచగవ్యరాధన, ఉత్సవ విగ్రహమునకు అభిషేకములు, గణపతి, వాస్తు హోమాలు, మహా చండీయాగమును అత్యంత వైభవంగా భక్తుల నడుమ నిర్వహించారు. . తదుపరి ఆలయ చైర్మన్ మాట్లాడుతూ ఈ వేడుకలు ఈనెల 29వ తేదీతో ముగుస్తాయని, చివరి రోజు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. ఆలయానికి రెండు వైపులా ఆలయ ముఖ తోరణం దాతలను, అమ్మవారి ప్రాకారోత్సవమునకు టేకుతో రథము చేయించిన సేవా కర్తలను, ముఖ్యమైన దాతలను కూడా ఆహ్వానించి, వారి పేరిటన ప్రత్యేక పూజలు తోపాటు ఘనంగా సన్మానం కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు సాగా మురళి, గుర్రం రాధా, గుజ్జల నాగమ్మ, సాకే చౌడప్ప, నామ రాజశేఖర్ గుప్తా, బోయ నారాయణ, బోయ దుర్గ భవాని, పూజారి రామాంజనేయులు, ఆలయ మేనేజర్ రామశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img