Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

13 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం

విశాలాంధ్ర-గుంతకల్లు : రైల్వే డివిజన్ పరిధిలో రైల్లో చైన్ స్నాచింగ్ చేసిన అంతర్రాష్ట్ర దొంగను జి ఆర్ పి పోలీసులు అరెస్ట్ చేశారు.మంగళవారం జిఆర్ పి కార్యలయంలో అరెస్ట్ కు సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశంలో జిర్ పి డిఎస్పీ అబ్దుల్ నజీర్ వెల్లడించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా బిఇమి నగర్ కు చెందిన ఆకాష్ ప్రతాప్ సరోదే బేల్దారీ కూలీగా పని చేసేవాడని చెప్పారు.జల్సాలకు అలవాటు పడి రైళ్లలో చోరీలు చేశాడన్నారు.ఎవరికీ అనుమానం రాకుండా కిటికీల వద్ద కూర్చున్న మహిళలను టార్గెట్ చేసి మెడలో ఉండే బంగారు ఆభరణాలు, బ్యాగులను చోరీ చేసి తక్కువ ధరకు బంగారాన్ని అమ్ముకుని జల్సాలు చేయడం తిరిగి కూలిపనులకు వెళ్లి మరీ కొంతకాలానికి చోరీలు చేయడంతో పోలీసులకు దొంగను పట్టుకోవడం కష్టంగా మారిందన్నారు. మహారాష్ట్ర పోలీసుల సాయంతో స్థానిక జిఆర్ పి,ఆర్ పి ఎఫ్ పోలీసులు సమయస్ఫూర్తి తో దొంగను పట్టుకున్నట్లు వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసి రూ. 7.56 లక్షల విలువ చేసే 13 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గుంతకల్లు లో రెండు దొంగతనాలు,గుత్తిలో ఒకటి, కడప ఒక దొంగతనం చేసినట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img