Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అంబేద్కర్ కు ఘన నివాళులర్పించిన సిపిఐ నాయకులు

విశాలాంధ్ర -ఉరవకొండ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉరవకొండలో సిపిఐ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కేశవరెడ్డి మాట్లాడుతూ బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన అంబేద్కర్ యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా కొనసాగించాలన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ కార్యదర్శి మల్లికార్జున సహాయ కార్యదర్శి మనోహర్, పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ మండల కార్యదర్శి తలారి మల్లికార్జున, సిపిఐ నాయకులు గణప మల్లి, కార్మిక సంఘం నాయకులు చక్రధర్, సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img