Friday, April 19, 2024
Friday, April 19, 2024

అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ పట్టణము నందు శనివారం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని ప్రతిపక్ష నాయకులకు పర్యటనలకు విలువ లేనందున వారు నిరసన వ్యక్తం చేశారు శుక్రవారం నారా చంద్రబాబు నాయుడు అనపర్తి సభకు పోలీసులు అనుమతి ఇచ్చి మళ్లీ రద్దుచేసి చంద్రబాబు అనపర్తి పర్యటనను అడ్డుకున్నందుకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వ, నిరంకుశ వైఖరిని నశిస్తూ అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేశారు ప్లకార్డులు ప్రదర్శించి, జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గ పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వై సి పి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వెంకట్ రాముడు, పట్టణ అధ్యక్షుడు రవిశంకర్, రాష్ట్ర హుజూర్ లాఖాన్, రామలింగ, సాయి ప్రసాద్, రియాజ్, వాజిద్, వలీ పీర్, షౌకత్, సయ్యద్, పెద్దన్న, ఆండ్రూస్, చంద్ర, ఆవుల నరేంద్ర, చంద్రమౌళి , నంజుండ, ఖాదిర్, నాగరాజు, వెంకటేష్, నజీర్, వడ్డె నాగప్ప, పోతిరెడ్డి, శివ,టెంకాయల ఫారుక్, హర్షద్ అలీ, షమున్, నాగరాజు, నారాయణ, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img