Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అక్షరాన్ని బ్రతికిద్దాం అమ్మభాషను కాపాడుకుందాం

జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి.గంగరాజు

విశాలాంధ్ర-గుంతకల్లు : అక్షరాన్ని బ్రతికిద్దాం అమ్మభాషను కాపాడుకుందామని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి.గంగరాజు అన్నారు.మంగళవారం డాఁసరోజిని నాయుడు బాలికల ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ అధ్యక్షత వహించారు.ముఖ్యఅతిథిలుగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి.గంగరాజు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి హరిప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు. భాష పరిరక్షణ కోసం ప్రాణాలు అర్పించిన బెంగాలీ యువకులు గుర్తుగా అంతర్జాతీయ భాష దినోత్సవ కార్యక్రమము నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు.అయితే మన మాతృభాష తెలుగు బోధన భాషగా కాకుండా ఒక్క అంశానికి పరిమితం కావడం వల్లన తెలుగు భాషను తెలుగు అక్షరాలును మరిచిపోయే పరిస్థితి దాపురించిందన్నారు. ఇది అలాగే కొనసాగితే సంస్కృతం లాగే తెలుగు కూడా కనుమరుగు అవుతుంది అని కాబట్టి విద్యార్థులు అందరూ తెలుగు దినపత్రికలు.పుస్తకాలు. కథలు చదవలన్నారు.అనంతరం అంతర్జాతీయ భాషాదినోత్సవని పురస్కరించుకుని నిర్వహించిన వ్యాస రచన పోటీలలోని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాద్యాయరాలు బి. యల్ .జ్యోతి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img