Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అగ్ని ప్రమాదాలు పై విద్యార్థులకు అవగాహన

విశాలాంధ్ర -ఉరవకొండ : అగ్ని ప్రమాదాల నివారణపై అగ్నిమాపక శాఖ అధికారులు ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు ఆ శాఖ వారోత్సవాల్లో భాగంగా  సోమవారం ఫైర్ స్టేషన్ ఆఫీసర్ ఏ.భీ మలింగయ్య ఆధ్వర్యంలో  వివిధ ప్రదర్శన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతూ ఎలక్ట్రికల్, ఆయిల్, గ్యాస్, వల్ల అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు, నివారణ చర్యలు  తీసుకోవాలో వివరించారు. అదేవిధంగా ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా తమ శాఖ ముద్రించిన  కరపత్రాలను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో  ఫైర్ స్టేషన్, మరియు డిగ్రీ కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img