Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అద్దె భవనంలోకి పాఠశాల విద్యార్థులు

విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ పట్టణం శివరామి రెడ్డి కాలనీలో 40 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ అక్కడ ప్రభుత్వ పాఠశాల లేకపోవడంతో ఈ విద్యా సంవత్సరంలో అద్దె భవనం తీసుకొని నూతన పాఠశాలను ఏర్పాటు చేసి ఇద్దరు ఉపాధ్యాయులను నియమించారు. అయితే అద్దె చెల్లించకపోవడంతో భవన యాజమాన్యులు ఖాళీ చేయించారు దీంతో కాలనీలో సమీపంలో రేకల షెడ్డులో మరియు ఒక చెట్టు కింద కట్టపై తాత్కాలిక పాఠశాలను ఏర్పాటు చేసుకొని చదువులు చెబుతున్నారు, ఈ విషయం తెలుసుకున్న డీఈవో శుక్రవారం డివై ఈవో శంకర్ ప్రసాద్ ను పరిశీలనకు పంపారు. ఈ సందర్భంగా రేఖల షెడ్డు నందు ఉన్న పాఠశాలను ఆయన పరిశీలించారు ఇదే విషయాన్ని డీఈఓ కి తెలియజేయడంతో వెంటనే స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి భవనాలకు ప్రభుత్వం అద్దె చెల్లిస్తుందని వెంటనే అద్దె భవనాల్లోకి పాఠశాలను మార్చాలని సూచించారు వెంటనే ఆయన రేకల షెడ్డులో చదువుకుంటున్న విద్యార్థులను మరో అద్దె భవనంలోకి మార్చడం జరిగింది దీనిపై డివై ఈవో మాట్లాడుతూ శివరామిరెడ్డి కాలనీలో పాఠశాల నూతన భవనాలు నిర్మాణం అయ్యేంతవరకు అద్దె భవనంలోనే పాఠశాలను నిర్వహిస్తామని స్థల పరిశీలన చేసి పాఠశాల యొక్క భవన నిర్మాణాలకు ప్రణాళిక సిద్ధం చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులతో చర్చిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఈశ్వరప్ప, వార్డు సభ్యులు వసికేరి మల్లికార్జున పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img