Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

అనంత సంకల్ప కార్యక్రమం పరిశీలన

విశాలాంధ్ర -శెట్టూరు : రాష్ట్ర ప్రభుత్వం రాబోయే పదవ తరగతి పరీక్ష దృష్టిలో ఉంచుకుని
పదవ తరగతి విద్యార్థులు కోసం ప్రత్యేక అనంత సంకల్ప వంద రోజులు కార్యక్రమాన్ని శుక్రవారం డిప్యూటీ డీఈవో పద్మప్రియ జడ్పి ఉన్నత పాఠశాలని నిర్వహిస్తున్న అనంత సంకల్ప కార్యక్రమాన్ని పరిశీలించారు ప్రతిరోజు ప్రత్యేక సబ్జెక్టు రౌండ్ టెస్టు గ్రాండ్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్లు, విద్యార్థులకు బోధించాలని, అనంత సంకల్ప నిర్వహిస్తే ప్రతిరోజు సంబంధించిన వెనుకబడిన విద్యార్థులు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం మండలంలోని ఉత్తమ స్థాయి ఫలితాలు వస్తా అన్నారు ప్రతి విద్యార్థి కూడా ఉపాధ్యాయుల చెప్పే బోధనలను సక్రమంగా విని జిల్లాలో మన మండలాన్ని మొదటి స్థానంలో నిలబెట్టాలని విద్యార్థులకు ఆమె సూచించారు విద్యార్థులకు రాత్రిపూట స్టడీ అవర్స్ పైన ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీధర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్, సబ్జెక్ట్ టీచర్ జీవన్ బాబు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img