Friday, April 19, 2024
Friday, April 19, 2024

అన్ని దానములో కన్నా విద్యాదానం మిన్న.. గ్రంథాలయ అధికారిని అంజలీ సౌభాగ్యవతి

విశాలాంధ్ర-ధర్మవరం : అన్ని దానముల కన్నా విద్యాదానం ఎంతో గొప్పదని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో శనివారం పాఠకులకు పలు విషయాలను వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేటి గ్రంథాలయాలు బాల్యం వయసు నుండి నేటి యువత కొరకు అవసరమైన పుస్తకాలు, పోటీ పరీక్షలకు కావలసిన స్టడీ మెటీరియల్స్ కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గ్రంథాలయాల్లో తెలిపిన సమయాలలో ఈ పుస్తకాలతో మంచి నైపుణ్యాన్ని పొందవచ్చునని తెలిపారు. అంతేకాకుండా గ్రంథాలయములో సభ్యతమును కూడా దాతల సహకారంతో నిర్వహిస్తున్నామని, అవసరమున్నవారు ఆధార్ కార్డు జిరాక్స్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోను గ్రంథాలయంలో అందించాలని తెలిపారు. అంతేకాకుండా విద్యకు సంబంధించిన పుస్తకాలు తమ ఇంటి వద్ద ఉన్న యెడల వాటిని సద్వినియోగం చేసుకునేందుకు గ్రంథాలయాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన తేదీలలో కూడా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, దాతలు కూడా తమవంతుగా గ్రంథాలయానికి నగదు రూపేనా గాని, పుస్తక రూపేనా గాని, ఫర్నిచర్ రూపేనా గాని సహకారం అందించాలని వారు కోరారు. గ్రంథాలయం ప్రతి శుక్రవారం సెలవు దినముగా ఉంటుందని, పాఠకులు గమనించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది రమణ నాయక్, శివమ్మ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img