Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

అన్ని దేవాలయాలలో ఉగాది సంబరాల వేడుకలు

విశాలాంధ్ర – ధర్మవరం : తెలుగు సంవత్సరాది వేడుకలు పట్టణంలోని అన్ని దేవాలయాలలో ఉగాది సంబరాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అన్ని దేవాలయాలలో ప్రత్యేక పూజలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భక్తాదులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అన్ని దేవాలయాలలో పంచాంగ శ్రవణాలు కూడా పురోహితులు భక్తులకు చదివి వినిపించారు. ఇందులో భాగంగానే బుధవారం రాత్రి బాబు బాలాజీ శిష్య బృందం ఆలపించిన చిన్నారుల నృత్యం అందరినీ ఆకట్టుకుంది. కొత్తపేటలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించిన వైనం అందరినీ ఆకట్టు ఉంది. అదేవిధంగా బ్రాహ్మణ వీధిలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఆస్థాన సేవ సందడిగా జరిగింది. ఆలయ పూజారులు భాను ప్రతాప్, కోనేరాచార్యులు, బాబు స్వామీలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు పోరాల్ల పద్మావతి, పోరాల్ల పుల్లయ్య ,సత్రశాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మూలమూర్తికి సుప్రభాత సేవతో ఉత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రాకారోత్సవం నిర్వహించి అన్నమయ్య సేవా మండలి ఆధ్వర్యంలో భక్తి గానలహరి చేశారు. తదుపరి శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి లో జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ఆధ్వర్యంలో ఉగాది పండుగ సంబరాలు లో భాగంగా ధర్మవరం నాట్యాచార్యులు బాబు బాలాజీ, కమల బాలాజీ ల కుమార్తె రామ లాలిత్య చేసిన నాట్యం అందరినీ ఆకట్టుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img