Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అప్పర్ బద్ర ప్రాజెక్టుని తక్షణమే నిలుపుదల చేయాలి..

కేంద్ర ప్రభుత్వం రాయలసీమ ప్రాంతాలకు తీవ్ర అన్యాయం చేసింది…

అనంతపురం జిల్లాకు తాగునీరు లేకుండా ఎడారిలా మార్చేందుకే భద్ర ప్రాజెక్టు…

  • సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్

విశాలాంధ్ర-గుంతకల్లు : అప్పర్ బద్ర ప్రాజెక్టు తక్షణమే నిలుపుదల చేయాలి దీనివల్ల వెనకబడ్డ రాయలసీమ జిల్లాలకు తుంగభద్ర నీరు రాకుండా పోయే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం రాయలసీమకు అన్యాయం చేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. శనివారం సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి.జగదీష్ మాట్లాడుతూ కర్ణాటకకు చెందిన ాఅప్పర్‌ భద్ర్ణ ప్రాజెక్టుకు ఆగమేఘాల మీద అనుమతులు మంజూరు చేసి, జాతీయ హోదా కల్పించి, నిర్మాణ పనులు శరవేగంగా జరిగేలా చూస్తోందని తెలిపారు.అప్పర్ భద్ర ప్రాజెక్టు వల్ల రాయలసీమ జిల్లాలకు తుంగభద్ర నీరు రాకుండా పోయే ప్రమాదం ఉందన్నారు.అంతేకాకుండా రాష్ట్ర ప్రయోజనాలకు కూడా ఇది నష్టం వాటిల్లుతుందని తెలిపారు.అనంతపురం జిల్లా కనీసం తాగునీరు కూడా అందకుండా ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉందన్నారు.ఎగువ భద్ర ప్రాజెక్టు పూర్తయితే, తుంగభద్ర, శ్రీశైలం డ్యామ్‌లు పూర్తిస్థాయిలో నిండే పరిస్థితి ఉండదన్నారు. అనంతపురం కర్నూలు కడప జిల్లా లకు ఏకైక నీటి ఆధారమైన హై లెవెల్‌ కెనాల్‌ (హెచ్‌ఎల్‌సీ) లో లెవెల్, మరియు కేసీ కెనాల్ ఎండిపోయే పరిస్థితి దాపురిస్తుందని తెలిపారు. ఆంధ్ర,తెలంగాణ, కర్ణాటక సంబంధించినవని తెలిపారు. తుంగభద్ర నీరు 137 టీఎంసీలు పట్టే సమర్థత కలిగి ఉండగా పూడికలు పేరుకుని 100 టీఎంసీలకే పడిపోయిందన్నారు ఇక ఎగువ ప్రాంతంలో ఉన్న అప్పర్ బద్ర నిర్మిస్తే తుంగభద్ర నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. తుంగభద్ర జలాశయం నుండి అనంతపురం కడప కర్నూలు మూడు జిల్లాలకు వెరసి7 లక్షల 94 వేల ఎకరాల ఆయకట్టుతో నికర జలాలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించినది,బ్రిజేష్ కుమార్ తీర్పుపై కోర్టులో నడుస్తున్నప్పటికీ అయినా జాతీయ ప్రాజెక్టుగా అడ్డంగా ఆమోదించి5, 300 కోట్ల నిధులతో నిర్మాణాలు చేపట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నారు. చట్ట విరుద్ధంగా కోర్టులో కేసు నడుస్తున్న తెలుగు రాష్ట్రాల కళ్ళు కప్పి అక్రమంగా నిర్మాణాలు చేపడుతుంటే వైసీపి మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎంపీలు గాడిదలు కాస్తున్నారని ప్రశ్నించారు. పార్లమెంట్లో ఎంపీలు అడ్డగించేది పోయి గొడ్డలిపెట్టుగా నిర్మిస్తుంటే రాష్ట్రానికి విఘాతం కల్పిస్తున్నారన్నారు. వైసిపి ప్రభుత్వం బిజెపికి దాసోహం అంటుందన్నారు. 30 టీఎంసీల తో లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మిస్తుంటే నేడు తుంగభద్ర డ్యామ్‌కు కనీసం నీరు కూడా చేరే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఇంత అన్యాయం జరుగుతున్న వైసిపి ప్రభుత్వం నోరు మెదపకుండా మాట్లాడలేకపోతున్నారన్నారు. వైసిపి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదన్నారు.కలిసి వచ్చే రైతులను ప్రజలను మరియు ప్రతిపక్ష రాజకీయ పార్టీలను కలుపుకుని రాజకీయాలకతీతంగా అప్పర్‌ భద్ర నిర్మాణాన్ని అడ్డుకోవడంలో ప్రజా ఉద్యమం తీసుకొచ్చి ఆందోళన నిర్వహిస్తునట్లు తెలిపారు. తుంగభద్ర డ్యాం పరిశీలనకు అప్పర్ బద్ర వల్ల జరిగే నష్టాన్ని తెలుసుకోవడానికి ఈనెల 13వ తేదీన రాష్ట్ర ప్రతినిధి బృందంతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో పరిశీలనకు వెళుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ నియోజవర్గం కార్యదర్శి వీరభద్రస్వామి, సిపిఐ నియోజకవర్గం సహాయ కార్యదర్శి బి.మహేష్ ,సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ ఎం డి గౌస్ ,సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి రామాంజనేయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img