Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

అప్పర్ భద్ర ప్రాజెక్టు చేపడుతుంటే వైసిపి ప్రభుత్వానికి చీమకుట్టైన లేదు…

టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్ర గౌడ్

విశాలాంధ్ర-గుంతకల్లు : అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేయంగా జరిగేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వైసీపీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్ర గౌడ్ అన్నారు. సోమవారం పట్టణంలోని టిడిపి మాజీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్ జితేంద్ర గౌడ్ మాట్లాడుతూ కర్ణాటకలో అప్పర్ బద్ర ప్రాజెక్టు నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించి శరవేగంగా నిర్మాణ పనులు చేపట్టేందుకు చూస్తుంది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ జిల్లాలకు తుంగభద్ర నీరు రాకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. వెనుకబడిన జిల్లాల్లో అనంతపురం జిల్లాకు తుంగభద్ర నీరు రాకుండా ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉందన్నారు.ఎగువ భద్ర ప్రాజెక్టు పూర్తయితే కర్ణాటకలోని తుంగభద్ర శ్రీశైలం డ్యాములకు అదేవిధంగా అనంతపురం కర్నూలు కడప జిల్లాలకు ఏకైక నీటి ఆధారమైన హై లెవెల్ కెనాల్ హెచ్ ఎల్ సి అదేవిధంగా కేసీ కెనాల్ ఎండిపోయే పరిస్థితి దాపరిస్తుందని తెలిపారు.అప్పర్ బద్ర నిర్మిస్తే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఇప్పటికైనా రాజకీయ విభేదాలు పక్కన పెట్టి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు అన్ని పార్టీలతో కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వానికి ఒత్తిడి చేసి అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలబెట్టేందుకు దశలవారీగా ఉద్యమ పోరాటాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు తలారి మస్తానప్ప ,బందా నవాజ్ ,జగన్నాథ్ ,హనుమంతు, ఆటో ఖాజా,టిఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img