Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య తక్షణమే ప్రభుత్వం 10 లక్షలు మంజూరు చేయాలి

సిపిఐ నాయకులు డిమాండ్

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : బుక్కరాయసముద్రం మండలం పసులూరు గ్రామం తలారి శివయ్య వయస్సు 32 ఈరోజు ఉదయం తన పొలానికి తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సిపిఐ నాయకులు గురువారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి విచ్చేసి నివాళులర్పించారు. ఈయనకు భార్య ముగ్గురు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నారు. గత ఐదు సంవత్సరాల నుంచి దాదాపుగా 12 ఎకరాల భూమి సాగు చేసుకుంటూ పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక గత సంవత్సరం ఐదు ఎకరాల్లో దానిమ్మ సాగు చేసి పంట చేతికొచ్చిన వేళ మంటలలో పూర్తిగా బూడిద, అవ్వడం జరిగింది. ఆత్మహత్య చేసుకున్న యువ రైతుని జిల్లా రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సి మల్లికార్జున, సింగనమల కార్యదర్శి టి నారాయణస్వామి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ నాగరాజు వారి కుటుంబ సభ్యుల ను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రైతు పేరు చెప్పే అధికారం లోకి వచ్చిన ప్రభుత్వం రైతులకు రైతులు ఆత్మకు తెలిసి చేసుకుంటా ఉంటే అధికారులు గాని ప్రజా ప్రతినిధులు గాని వారిని పట్టించుకున్న పాపాన పోలేదు అన్నారు. ప్రస్తుతం రైతు భరోసా కేంద్రాల్లో వేరుశనగ సబ్సిడీ విత్తనాలకు కనీసం డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోలేని స్థితిలో ఈరోజు శివయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకోలేదు ఇది ప్రభుత్వ హత్య హత్యగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతుకు దక్కాల్సిన గిట్టుబాటు ధరలు సబ్సిడీలో ఎరువులు విత్తనాలు, మందులు పనిముట్లు డ్రిప్ పరికరాలు గాని అందించడంలో ప్రభుత్వం విఫలం అయినందువల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. తక్షణం ఆత్మహత్య చేసుకున్న శివయ్యకు 10 లక్షలు ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img