Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

అశేష ప్రజావాహిని మధ్య భీమిరెడ్డి విగ్రహావిష్కరణ…

  • మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,గుమ్మనూరు జయరామ్

విశాలాంధ్ర-గుంతకల్లు : అశేష ప్రజా వాహిని లో ఎల్లారెడ్డి భీమిరెడ్డి విగ్రహ ఆవిష్కరణ ను ఉప ముఖ్యమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు.బీమిరెడ్డి పార్కును ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు.వారి తో పాటు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఆవిష్కరణలో పాల్గొన్నారు. సోమవారం గుంతకల్లు కొనకొండ్ల మధ్యలో ఉన్న మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ఎల్లారెడ్డి భీమ్ రెడ్డి విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమాన్నికి గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన వహించారు. ఎల్లారెడ్డి భీమిరెడ్డి కుమారులు రామపురం మాజీ ఎంపీపీ సీతారామరెడ్డి, ఎమ్మెల్సీ శివరాం రెడ్డి ,ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జనవాహిని ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒకే కుటుంబంలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకరు ఎమ్మెల్సీగా రాజకీయ ప్రజాపదంలో ఉండడం ఎంతో గర్వకారణం అన్నారు. అంతేకాకుండా వీరు జగన్మోహన్ రెడ్డికి ఆప్త మిత్రులుగా ఉంటూ ఆయన ప్రోత్సాహంతో ఉరవకొండ మంత్రాలయం ఆదోని గుంతకల్లు ప్రాంతాలలో రాజకీయంగా అభివృద్ధి చేస్తూ ప్రజా మనల్ని పొందిన నాయకులుగా ఉన్నారని పేర్కొన్నారు. మంత్రి జయరాం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు భీమ్ రెడ్డి కుటుంబానికి ఎప్పుడు అండగా ఉండాలని వారి యొక్క సేవా దృక్పథాన్ని కొనియాడారు. అనంత వెంకట్రామిరెడ్డి కాపు రామచంద్ర రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ భీమ్ రెడ్డి కాలంలో పేదలకు భూ పంపిణీ ఆర్థిక సహాయం పేదల పట్ల సేవా నిరతిని కలిగి ఉండడం గొప్ప మానవీయతకు నిదర్శనం అన్నారు. భీమ్ రెడ్డి ఆనాటి సేవే ఈనాడు తన కుమారుల పట్ల ఉన్న ప్రజా ఆదరణ అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి,రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జిల్లా జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, గుంతకల్లు ఆర్డీవో రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ వెన్నుపూస గోపాల్ రెడ్డి ,వైయస్సార్సీపి సీనియర్ నాయకులు ఎర్రి స్వామి రెడ్డి ,గోపాల్ రెడ్డి, శివ సాయి స్వామి, గుంతకల్లు మున్సిపల్ చైర్ పర్సన్ భవాని, యువ నాయకుడు మంజునాథ్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నైరుతి రెడ్డి ,వైసిపి జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహారెడ్డి, ఎంపీపీ బీవీ మాధవి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ మై మున్ బి, తాహసిల్దార్ బి.రాము, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి భీమ్ రెడ్డి పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు వేల మంది ప్రజానీకానికి భోజనం వసతి కల్పించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తుతో సౌకర్యాలు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img