Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆకతాయిలు నిప్పు పెట్టడంతో 210 సపోటా చెట్లు అగ్నికి ఆహుతి

అయ్యా నా కుటుంబాన్ని ఆదుకోండి మహా ప్రభో

విశాలాంధ్ర- కదిరి : ఆకతాయిలు నిప్పు పెట్టడంతో దాదాపు రెండు వందల ఇరవై సపోటా,నేరేడు చెట్లు అగ్నికి ఆహుతి కావడంతో ఓ రైతు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.తలుపుల మండలం పెద్దన్నవారి పల్లి గ్రామానికి చెందిన తోపుల రామకుమార్ గత పది సంవత్స రాల క్రితం అప్పో సప్పో చేసి బోరు వేసి తన కున్న పొలంలో పంట సాగు చెయ్యాలనే ఆలోచనతో బోరు వేశారు.నీరు పడక పోవడంతో బ్యాంక్ ఋణం తీసుకొని దాదాపు ఐదు బోర్లు వేయగా ఒక్క ఇంచు నీరు పడగ పది సంవత్సరాల క్రితమే మూడు ఎకరాల్లో సపోటా,నేరేడు మొక్కలు నాటి కంటికి రెప్పల కాపాడు కొంటూ జీవనం సాగిస్తున్నారు.గతంలో కరోన కారణంగా చాలా నష్టపోగా ఈసారి ఎక్కువ శాతం పూత పిందె కాయడంతో పది సంవత్సరాల కష్టం పోయి పది రూపాయలు కళ్ళ చూద్దామనే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కంచెకు నిప్పు పెట్టడంతో అన్ని చెట్లు అగ్నికి ఆహుతి కావడంతో ఆ కుటుంబం కోలుకోలేని స్థితిలో పడింది.తనకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వ ఆధికారులు,ప్రజా ప్రతినిధులు ఆదుకోవాలని తనకు న్యాయం చెయ్యాలని ఎమ్మెల్యే సిద్దా రెడ్డిని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img