Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆత్మకూరులో ఘనంగా 98వ సి పి ఐ వార్షికోత్సవ వేడుకలు

విశాలాంధ్ర.. అనంతపురం వైద్యం : జెండా ఆవిష్కరణ సిపిఐ ఆత్మకూరు మండల ప్రధాన కార్యదర్శి సనప నీళ్లు పాల రామకృష్ణ, రైతు సంగం నాయకులు సిపిఐ నాయకులు ఏఐటియుసి ఆటో యూనియన్ నాయకులు సోమవారం పార్టీ జెండా ఆవిష్కరణ సభలో పాల్గొన్నారు. సిపిఐ మండల కార్యదర్శి సనప నీళ్లు పాల రామకృష్ణ మాట్లాడుతూ… ఈ 98వ వార్షికోత్సవం సందర్భంగా మనం మన పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలో చర్చించుకోవాల్సిన సమయం అసన్నమైంది. దేశంలో ఆర్ఎస్ఎస్ నియంత్రణలోని బీజేపీ ఫాసిస్టు పాలన సాగిస్తున్నది. ప్రభుత్వరంగాన్ని ప్రైవేటు రంగానికి
అమ్మేస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. పౌర హక్కుల ను కాల రాస్తూ నియంతృత్వ పాలన సాగిస్తున్నది, కార్మికులు సుదీర్ఘ పోరాటాల ద్వారా సాధించుకున్న సౌకర్యాలు, హక్కులు, రిజర్వేషన్లను రద్దు చేస్తున్నది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. రాజ్యాంగ సంస్థలు తమ పార్టీ అనుబంధం సంఘాలుగా మార్చి అధికార దుర్వినియోగం చేస్తున్నది. వీటికి వ్యతిరేకంగా లి సమరశీల పోరాటాలు, , ఐక్య ఉద్యమాలు చేయాల్సి ఉందన్నారు. మన గత చరిత్ర గర్వకారణమైనది. అయితే మా తాతలు నేతులు తాగారని గొప్పలు చెప్పుకుంటే ప్రజలు సమీకరణ చేయడం కాదన్నారు. మళ్లీ మరలా యుద్ధ రంగంలోకి దిగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు నడపాలి అని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు ఉద్యమ పునరైక్యత వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా పోరాటాలకు, కమ్యూనిస్టు ఉద్యమవ్యాప్తికి తరలి రండి అని మనం ప్రజా పునరంకితం అవుదామని ప్రతిజ్ఞ చేద్దాం అన్నారు. కమ్యూనిస్టుపార్టీ బలహీనమైందని, అది అంతరించి పోతుందని మన శత్రువులు నిరంతరం ప్రచారంచేస్తున్నారు. మతోన్మాదం, కులోవారం, డబ్బు ఆధారంగా ఎన్నికలు ! లి ఎన్నికలు జరుగుతున్నందున మన పార్టీలు ఎన్నికల్లో నష్టపోతున్నాయి. ఈ ఎన్నికలు ప్రజాభిప్రాయాన్ని ప్రతి లింబించవు. ఈ ఎన్నికలే మనకు ఇరు పార్లమెంటులో, శాసన సభల్లో మన ప్రతినిధులుంటే ప్రభుత్వ నిజస్వరూపాన్ని ఎండ కొండగడతామన్నారు . సభలో మన ప్రతినిధులు లేకపోతే బలమైన సమరశీల పోరాటాలు మరింత ఉధ్భతంగా ఉంటుందన్నారు. ప్రజలను నిరుత్సాహ పరచడానికి మన శత్రువులు మన బలహీనతల గురించి పదేపదే ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బండారు శివ ఈశ్వరయ్య రామన్న ముత్యాలప్ప ఏఐటీయూసీ ఆటో యూనియన్ రాము కన్నా ఆదర్శ్ కేశవ రామకృష్ణారెడ్డి యశ్వంత్ తాతయ్య లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img