Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆరోగ్యం పట్ల ప్రజలు అశ్రద్ధ వహించరాదు.. డాక్టర్‌ అరిగెల గణేష్‌

విశాలాంధ్ర`ధర్మవరం : ఆరోగ్యం పట్ల ప్రజలు అశ్రద్ధ వహించరాదని డాక్టర్‌ అరిగెల గణేష్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్టిసి బస్టాండ్‌ రోడ్డు లో గల అరిగెల పోతన హాస్పిటల్‌ యందు ఉచిత గుండె వైద్య శిబిరం’’తండ్రి అరిగెల పోతన్న జ్ఞాపకార్థం’’నిర్వహించారు. ఈ శిబిరంలో జి ఆర్‌ బి ఎస్‌/బిపి/ఈసీజీ/2డి ఎకో పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. అనంతరం డాక్టర్‌ అరిగెల గణేష్‌ మాట్లాడుతూ నాల్గవ శిబిరంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుండి 135 మంది రోగులు పాల్గొనడం జరిగిందన్నారు. అధునాతమైన పరికరాలతో గుండెనొప్పి, గుండె దడ, ఆయాసము, కళ్ళు తిరుగుట, గుండెలో మంట, చాతిలో బరువు, కాళ్లు వాపు రావడం, చెమటలు పట్టడం లాంటి సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు పాటించవలసిన పద్ధతులు కూడా తెలియజేయడం జరిగిందన్నారు. నాలుగవ శిబిరమునకు ప్రజల నుండి విశేష స్పందన రావడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం సవేరా హాస్పిటల్‌ టెక్నీషియన్స్‌, నర్సులు, స్థానిక హాస్పిటల్‌ నర్సులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img