Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఆసుపత్రిలోనే సుఖప్రసవాలు చేయాలి : కలెక్టర్ ఎం.గౌతమి

విశాలాంధ్ర-రాప్తాడు : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే సుఖప్రసవాలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం గౌతమి ఆదేశించారు. రాప్తాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిహెచ్ సి ని తనిఖీ చేస్తూ అక్కడ విభాగాలన్నింటినీ పరిశీలించారు. పీహెచ్ సి భవనాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రసవాలు ఇక్కడే చేపడుతున్నారా అని అక్కడ డాక్టర్ను ప్రశ్నించగా సాధారణ ప్రసవాలను ఇక్కడ చేస్తున్నామని ఏదైనా క్రిటికల్ కేసులు ఉంటే వాటిని జిల్లా ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న గర్భిణీతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అంగన్వాడీ సిబ్బంది మీ ఇంటికి వస్తున్నారా అని అడగగా ఆమె వస్తున్నారని సమాధానం ఇచ్చారు. ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆరోగ్య కేంద్రం లోని డాక్టర్ ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడాలి అని ఆమెకు సూచించారు.ప్రజలకు మరింత చేరువగా నాణ్యమైన సేవలు అందించడానికి ప్రభుత్వం అందించే ఆరోగ్య సేవలను, మాత, శిశు సంరక్షణ సేవలు, కుటుంబ నియంత్రణ, సాధారణ ప్రసవాల పట్ల అవగాహన పెంచాలన్నారు. ఆసుపత్రికి ప్రతిరోజు రోగులు ఎంతమంది వస్తున్నారు. ఇన్ పేషంట్స్ వారి గురించి వాకబు చేశారు. అనంతరం ఫార్మసీని పరిశీలించారు. తర్వాత మందుల గోడౌన్ ను తనిఖీ చేశారు.
ఈ కార్యక్రమంలో అనంతపురం ఆర్డీవో మధుసూదన్, ఇంచార్జి తహసిల్దార్ లక్ష్మీ నరసింహా, ఎంపీడీఓ సాల్మన్, డాక్టర్ శ్రావణి, ఆసుపత్రి సిబ్బంది, వీఆర్ఓ లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img