Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఇంటర్ పరీక్షలకు సకాలంలో విద్యార్థులు హాజరు కావాలి… డివి ఈవో.. రఘునాథరెడ్డి

విశాలాంధ్ర -ధర్మవరం : ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరపు విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ఈనెల 15వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని, పరీక్షలకు విద్యార్థులు సకాలంలో హాజరుకావాలని ఉమ్మడి జిల్లాల ఆర్ఐఓ.. సురేష్, శ్రీ సత్య సాయి జిల్లా డివిఈవో.. రఘునాథరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటర్ పరీక్ష ఏర్పాటును కూడా జిల్లాలో పలుచోట్ల పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అన్ని వసతులు సర్వం సిద్ధం చేయడం జరిగిందని వారు తెలిపారు. ధర్మవరం పట్టణంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, సంజయ్ నగర్ లోని వాసవి జూనియర్ కళాశాల, గుట్ట కింద పల్లి లో గల ఏపీ మోడల్ స్కూల్ అండ్ కాలేజ్, సాయి నగర్ లోని సీతారామయ్య గర్ల్స్ కాలేజ్ లలో(మొత్తం ఐదు పరీక్ష కేంద్రాలు) పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరపు విద్యార్థులకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష సమయం ఉంటుందన్నారు. విద్యార్థులందరూ కూడా పరీక్షా కేంద్రాలకు ఉదయం 8:30 గంటల లోపు చేరుకోవాలని తెలిపారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా అనుమతించబడదని వారు తెలిపారు. చెన్నై కొత్తపల్లి, కనగానపల్లి విద్యార్థులకు ప్రత్యేక బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగిందన్నారు. పరీక్షల్లో విద్యార్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్స్ పరికరాలు తీసుకొని పోకూడదని తెలిపారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాలలో ఇన్విజిలేటర్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కూడా సెల్ ఫోన్లు తీసుకొని పోరాదని వారు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. కేవలం ప్రభుత్వం అనుమతించిన బేసిక్ సెల్ఫోన్ మాత్రమే చీఫ్ సూపర్డెంట్ వద్ద మాత్రమే ఉంటుందని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ పరీక్ష సమయంలో తమ, తమ పిల్లలకు చేదోడు, వాదోడుగా ఉంటూ, పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత శాతం వచ్చే విధంగా ప్రోత్సహించాలని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img