Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఇంటి వద్దకే ప్రభుత్వ వైద్య సేవలు

విశాలాంధ్ర- బొమ్మనహల్: వైయస్సార్ ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో ఇంటి వద్దకే వచ్చి వైద్య సేవలు అందిస్తున్నామని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి సుల్తానా అన్నారు బుధవారం మండలంలోని కళ్ళు హోళ గ్రామంలో వైఎస్ఆర్ ఫ్యామిలీ పిజిషన్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మాత్రలు పంపిణీ చేశారు గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే రోగాలు రావని ప్రజలకు వివరించారు బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త గోవర్ధన్ ఏఎన్ఎం అరుణ ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img