Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై పునఃసమీక్షించండి

విశాలాంధ్ర-రాప్తాడు : ఆర్థికంగా బలహీన వర్గాలుగా (ఈడబ్ల్యూఎస్‌) ఉన్న వారికి రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అప్రజాస్వామికంగా ఉందని, దీన్ని సమీక్షించాలని రాప్తాడు డిప్యూటీ తహశీల్దార్‌ లక్ష్మీనరసింహకు అనంతపురం జిల్లా బహుజన సమాజ్‌ పార్టీ రాప్తాడు నియోజకవర్గం అధ్యక్షుడు ఎం.ఆంజయ్య, కన్వీనర్‌ నారాయణ, కల్యాణి బుధవారం వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు రాజ్యాంగ మౌళికతను దెబ్బతీసే విధంగా ఉందన్నారు. ఏ అంశాల ఆధారంగా ఆర్థికంగా వెనుకబాటుతనాన్ని నిర్ణయిస్తారన్నారు. ఆర్థిక వెనుకబాటు అనేది ఒక్కో ఏడాది ఒక్కో విధంగా ఉంటుందని, అలాంటప్పుడు ఒక కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా ఈడబ్ల్యూఎస్‌ నిర్ణయించి వారికి సర్టిఫికెట్‌ ఇస్తారని ప్రశ్నించారు. బీసీ క్రిమిలేయర్‌ విధానంలో సూచించిన కొలమానాలకు, ఈడబ్ల్యూఎస్‌లో నిర్ణయించిన కొలమానాలకు తేడా ఉందని, మరి ఈ తారతమ్యం ఎందుకని… ఈ వెసులుబాటు అధిపత్య కులాల వారికి మాత్రమే ఎందుకు ఇస్తున్నారని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img