Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఈనెల 24 న చలో జిల్లా కలెక్టరేట్ ధర్నా…

ఆశా వర్కర్స్ సమస్యలు పరిష్కరించండి..

ఏఐటియుసి మండల కార్యదర్శి ఈశ్వరయ్య

విశాలాంధ్ర-గుంతకల్లు : ఏపి ఆశా వర్కర్స్ యూనియన్(ఏఐటియుసి) ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ సమస్యపై గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రి ఇన్చార్జికి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మండల కార్యదర్శి ఈశ్వరయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్ ,మండల కార్యదర్శి రాము రాయల్ ,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ… ఆశాలకు 4 సం,లు గా బకాయి ఉన్న టీబి,లెప్రసీ అలవెన్సులు వెంటనే ఇవ్వాలన్నారు,ఇంతకముందు నాణ్యత లేని యూనిఫామ్ లు ఇచ్చారని నాణ్యత కలిగిన యూనిఫారాలు వెంటనే ఇవ్వాలన్నారు,సుప్రీం కోర్ట్ చెప్పిన విధంగా ఆశా వర్కర్స్ కు 18 వేలు కనీస వేతనం ఇవ్వాలన్నారు,ఆశా కార్మికుల పనివత్తిడి పెరిగి చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు,ప్రభుత్వ ఉద్యోగులు కాదంటూనే సంక్షేమ పథకాలు కోత పెట్టడం సరైందికాదన్నారు,కోవిడ్ లెక్కచేయకుండా ప్రజలకు సేవచేసిన ఆశాలకు ప్రత్యేక అలవెన్సులు ఇస్తామని ఇవ్వలేదన్నారు,కరోనాలో మరణించిన వారికి 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు,దేశంలో ఏ రాష్ట్రంలోను లేనివిధంగా మన రాష్ట్రంలో ఆశాలను రిటైర్ మెంట్ చేస్తున్నారన్నారు,రిటైర్ మెంట్ చేసిన ఆశా వర్కర్లకు 10 లక్షలు బెన్ఫిట్స్ ఇవ్వాలన్నారు.. ఆశ వర్కర్ల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని ఈనెల 24 తారీఖున చలో జిల్లా కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏపి ఆశా వర్కర్స్ యూనియన్ ఆశా వర్కర్స్ ప్రమీలా, ఫాతీమా,శిరీష,రెహనా,భాగ్యమ్మ,సరలా,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారుౌ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img