Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఉచిత దంత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి.. దంత వైద్యులు వివేక్

విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని బ్రాహ్మణ వీధి ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా గల డాక్టర్ కుళ్లాయప్ప గారి ఆశ హాస్పిటల్ లో ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత దంతవైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోవాలని దంత వైద్య నిపుణులు కే. వివేక్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఉచిత దంత ఆరోగ్య పరీక్షలు నిర్వహించబడునని, తప్పనిసరిగా విద్యార్థి గుర్తింపు కార్డు తీసుకొని రావాలని వారు తెలిపారు. అదేవిధంగా పేద ప్రజలకు ఉచితంగా పళ్ళు(ఎంపిక చేయబడిన వారికి మాత్రమే) తీయబడునని,రేషన్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరి గా తీసుకొని రావాలని తెలిపారు. అదేవిధంగా షుగర్ బిపి ఇతర జబ్బులు ఉన్నవారు, వారి పాత రిపోర్టులు మాత్రలు తీసుకొని రావలెనని తెలిపారు. పేషంట్ తో పాటు ఒక సహాయకుడు కూడా ఉండాలని వారు తెలిపారు. ఈ అవకాశాన్ని పేద ప్రజలు, విద్యార్థులు సద్వినియోగం చేసుకొని, తమ దంతల పట్ల భద్రత కల్పించుకోవాలని వారు సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img