Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఉచిత బాస్కెట్బాల్ వేసవి శిక్షణ శిబిరం

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో ఈనెల 5వ తేదీ నుండి నెల రోజులపాటు జిల్లా క్రీడాపాధికారిక సంస్థ సహకారంతో ఉచిత బాస్కెట్బాల్ వేసవి శిక్షణ శిబిరమును నిర్వహిస్తున్నట్లు ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డి, అధ్యక్షులు మేడాపురం రామిరెడ్డి, కార్యదర్శి వాయల్పాడుహిదాయతుల్ల బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలు కూడా జీవితములో మంచి గుర్తింపును ఇస్తాయని, బాల, బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. శిక్షణా శిబిరం ఉదయం సాయంత్రం రెండు పూటలా కొనసాగుతుందని తెలిపారు. ఆసక్తి గలవారు మరిన్ని వివరాలకు 9030944717 కు గాని 9391710032 కు సంప్రదించాలని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img