Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన…

ముఖ్య అతిథులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్

విశాలాంధ్ర-గుంతకల్లు : ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం అందాలనే ఉద్దేశంతో సిపిఐ నాయకులు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన శిబిరానికి మంచి స్పందన వచ్చింది. మంగళవారం పట్టణంలోని పాత గుంతకల్లు హమాలీ కార్యాలయంలో 26వ వార్డు సిపిఐ కౌన్సిలర్ బోయలక్ష్మి, సిపిఐ నియోజవర్గం సహాయ కార్యదర్శి బి.మహేష్ ,హమాలీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ చేతుల మీదుగా ప్రారంభించారు. సిపిఐ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బి.గోవిందు, సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్ పాల్గొన్నారు.అనంతరం సుమారు 300 మంది వరకు డాక్టర్లు విక్రమ్,మహేష్ లు వైద్య చికిత్సలు అందించారు. అదేవిధంగా ఉచితంగా టాబ్లెట్లు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డి.జగదీష్ మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందన్నారు. ప్రతి నిరుపేద కుటుంబానికి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు అభినందనీయమన్నారు. చాలా మందికి వారి ఆరోగ్యం ఎలా ఉందో తెలియని పరిస్థితి ఉందన్నారు.పేదలకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేసినందుకు అబినందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ఎండి గౌస్,సీపీఐ మండల కార్యదర్శి రాము రాయల్ , సిపిఐ మండల సహాయ కార్యదర్శి రామాంజనేయులు,ఏఐటియుసి మండల కార్యదర్శి ఈశ్వరయ్య,ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి పిసీ కుల్లాయప్ప,సీపీఐ నాయకులు మల్లయ్య,దౌలా,ఉమ్మర్ బాషా,పుల్లయ్య, ప్రసాద్ ,మహిళా సమాఖ్య నియోజికవర్గం కార్యదర్శి రామంజినమ్మ,ఏఐఎస్ ఎఫ్ నియోజికవర్గం కార్యదర్శి వెంకట్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img