Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఉరవకొండలో ఘనంగా టైలర్స్ దినోత్సవం

విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండలో మంగళవారం ప్రపంచ టైలర్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి టైలర్లు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టైలర్ ల అసోసియేషన్ అధ్యక్షులు జంగిలి నగేష్, మాట్లాడుతూ కుట్టు మిషన్ కనిపెట్టి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి జీవనోపాధి కల్పించిన కుట్టు మిషన్ సృష్టికర్త విలియమ్స్ హవే ని టైలర్స్ అందరు కూడా గుర్తుంచుకోవలసిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం కూడా టైలర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థిక సహాయాన్ని అందించాలని 55 సంవత్సరాల వయస్సు నిండి న టైలర్లకు పింఛను సౌకర్యం కల్పించాలని ప్రతి టైలర్ కి సబ్సిడీ రుణాల మంజూరు చేయాలని ఇళ్ల స్థలం కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంతమంది ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఉద్యోగ అవకాశాలు లేక టైలర్ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి, గౌరవ అధ్యక్షులు రాము, గౌరవ సలహాదారు రమేష్, సుధాకర్, సుధా అసోసియేషన్ సభ్యులు అశోక్, జాఫర్,ఆనంద్, హనుమప్ప, రాజా,రమేష్ ఉస్మాన్ వీటితోపాటు పెద్ద సంఖ్యలో టైలర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img