Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఎంబిబిఎస్ విద్యార్థినికి 97 వేలు ఆర్థిక సహాయం…

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలోని అభయ విద్యానిధి సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ సొసైటీ వ్యవస్థాపక చైర్మన్ సత్రసాల వసుంధర దేవి, అధ్యక్షురాలు దేవరశెట్టి మాధవిలత , కార్యదర్శి వరలక్ష్మి, కోశాధికారి అనురాధ మాట్లాడుతూ సప్తగిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ సెంటర్, బెంగళూరులో ఈరయ్యఅమృత అనే విద్యార్థిని ఎంబిబిఎస్ రెండవ సంవత్సరం చదువుతోందన్నారు. రెండవ సంవత్సరం ఫీజు చెల్లించలేక వారు పెంచుకుంటున్న పాడి పశువులను అమ్మి కొంత చెల్లించగా ఇంకా రూ.97,000లు తక్కువ కావడంతో అభయ విద్యానిధి సొసైటీ సభ్యులను సంప్రదించారన్నారు. దీంతో అమృత ఆర్థిక స్థితిని అలాగే ఆమె చదుతున్న ఇన్స్టిట్యూట్ సిబ్బంది ద్వారా పూర్తి వివరాలు సేకరించామన్నారు. ఫీజు చెల్లించకపోతే ఆమె చదువు ఆగిపోతుందని తెలుసుకుని వెంటనే రూ.97,000 లు చెల్లించామన్నారు..2013నుంచి తమ సొసైటీ ద్వారా ఇప్పటివరకు 112 మంది విద్యార్థునులకు అవసరమైన కాలేజీ ఫీజులను చెల్లించామన్నారు. ఆడపిల్లల చదువు కోసం ఆర్థిక సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటామన్నారు. సహాయం కావాల్సినవారు ప్రెసిడెంట్ మాధవి లత సెల్ నంబర్ : 9848866713 ని సంప్రదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అభయ విద్యానిధి సెక్రటరీ జిఎన్ వరలక్ష్మి ,ట్రెజరర్ అనురాధ గుప్తా ,జాయింట్ సెక్రెటరీ రాజ్యలక్ష్మి, చీఫ్ అడ్వైజర్ డాక్టర్ పత్తి హిమబిందు, సభ్యులు శాంతా రాజ్, సుకన్య ,జయలక్ష్మి, శారద,సుధా, విజయ, మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ త్రిశలా భంసాలి,హరిహరనాథ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img