Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఎమ్మెల్యే కేతిరెడ్డి పై ఆరోపణలు చేస్తే సహించేది లేదు.. రేగాటిపల్లి సర్పంచ్ సురేష్ రెడ్డి

విశాలాంధ్ర-ధర్మవరం : స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పై లేని, పోనీ ఆరోపణలు చేస్తే, సహించేది లేదని, అభివృద్ధిని ఓర్వలేకనే బురద చెల్లడం మానుకోవాలని, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకమ్ మధుసూదన్ రెడ్డి పై మంగళవారం రేగాటి పల్లి సర్పంచ్ సురేష్ రెడ్డి, రైతులతో కలిసి విలేకరుల సమావేశంలో మండిపడ్డారు. అనంతరం వారు మాట్లాడుతూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, ధర్మవరంలో ముస్లిం సోదరుల మధ్య చిచ్చుపెట్టి, ఎటువంటి సంబంధం లేని విషయాలపై ఎమ్మెల్యే పై ఆరోపణలు చేసి, రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ఖబర్దార్ అని వారు హెచ్చరించారు. ధర్మవరం ముస్లిం మత పెద్దలు అంతా ఎమ్మెల్యేకి ఎటువంటి సంబంధం లేదని చెప్పినా కూడా, చిలకం మధుసూదన్ రెడ్డి మాత్రం రాజకీయాలు చేయడం తగదని వారు సూచించారు. ప్రతిరోజు ఆరోపణలు చేస్తున్నారని, ఇది చిలకమ్ మధుసూదన్ రెడ్డికి సరికాదని హెచ్చరించారు. రేగాటి పల్లి సొసైటీ భూములలో ఉమ్మడిగా వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు అప్పటి మద్రాస్ ప్రభుత్వం 1949 లో పట్టాలు పంపిణీ చేసిందని తెలిపారు. వాటిలో అన్ని మతాలకు చెందినవారు 75 మంది రైతులు ఉమ్మడిగా వ్యవసాయం చేసుకుంటున్నారని వారు గుర్తు చేశారు. రేగాటిపల్లి, వెంకట తిమ్మాపురం, నిమ్మలకుంట, పోతుకుంట, జోగోని కుంట, తదితర ప్రాంతాలలో రైతులను బెదిరించి భూ కబ్జాలు చేసిన చరిత్ర చిలకమ్ మధుసూదన్ రెడ్డికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు నారాయణరెడ్డి, కొండారెడ్డి, మంజునాథరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి, నాగభూషణంతోపాటు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img