Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఎమ్మెల్సీ ఓటు విధానంపై అవగాహన సదస్సు

-ఆర్డిఓ రవీంధ్ర

విశాలాంధ్ర-గుంతకల్లు : ఎమ్మెల్సీ ఓటు విధానంపై సోమవారం ఎమ్మెల్సీ పట్టణంలోని మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్లో టీచర్స్ పట్టభద్రుల ఓటు వినియోగంపై గుంతకల్లు ఆర్డిఓ రవీంద్ర సమావేశం నిర్వహించారు. అనంతరం పట్టణ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఎసిపి ఇసాక్ ట్రైనింగ్ క్లాసును ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆర్డిఓ రవీంధ్ర మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఈనెల 13న శాసనమండలి, ఉపాధ్యాయ, పట్టభద్రుల కు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహించబడునని, అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఓటర్లు ఓటు వేసేటప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు ఇవ్వబడ్డ వైలెట్ కలర్ పెన్నుతోనే క్రమ సంఖ్యలు 1,2,3 లేకపోతే రోమన్కలు కూడా వాడి, వారి ప్రాధాన్యత ఓటును వేయవచ్చు అన్నారు. ఓటర్లు తప్పనిసరిగా తమ వెంట ఓటర్ స్లిప్ తో పాటు ఆధార్ కార్డు లేదా ఏదైనా ఐడెంటి కార్డు తీసుకొని పోలింగ్ కేంద్రాలకు రావాలని తెలిపారు. ఓటర్లకు పంచబడుతున్న ఓటర్ స్లిప్పుల వెనుక కూడా ఓటు వేసే విధానంపై ఇంగ్లీషు, తెలుగులో వివరంగా తెలుపబడ్డయనీ, దానిని అందరూ ఓటర్లు చదువుకొని, వాటిని పాటించాలన్నారు.ఈ కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మార్వో బి.రాము, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న,ఎంపీడీవో జాషువా ఎంఈఓ కులయప్ప పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img