Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఎయిడ్స్‌ నివారణ..నియంత్రణపై అవగాహన కల్పిస్తున్న కళారూపాలు

విశాలాంధ్ర`అనంతపురం.. వైద్యం : ఆంధ్రప్రదేశ్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖఆధ్వర్యంలో కళాకారుల ద్వారా అనంత పట్టణంలో గురువారం హెచ్‌.ఐ.వి/ఎయిడ్స్‌ పై వీధినాటక రూపంలో అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా హెచ్‌.ఐ.వి./ ఎయిడ్స్‌ గురించి తెలియజేస్తూ హెచ్‌.ఐ.వి. కేవలం 4 రకాలుగా వస్తుందని 1. సురక్షతంకానీ లైంగిక సంబంధాల ద్వారా,2. కలుషిత సూదులు సిరంజీల ద్వారా,3. కలుషిత రక్త మార్పిడి ద్వారా,4. హెచ్‌.ఐ.వి. సోకిన తల్లి నుండిబిడ్డకువస్తుందనఅన్నారు.హెచ్‌.ఐ.వి. వచ్చినప్పుడు తీసుకోవలసినజాగ్రతలు,హెచ్‌.ఐ.వి. ఉన్న గర్భిణీ స్త్రీల నుండి పుట్టబోయే బిడ్డలకు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కలిగించారు. యువతకు హెచ్‌.ఐ.వి గురించి అవగాహన లేకపోవడం సామాజిక మాధ్యమాలు, చెడు సహవాసాల కారణంగా హెచ్‌.ఐ.వి కి ఎలా గురి అవుతుంటారో వీధి నాటక రూపంలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. హెచ్‌.ఐ.వి సోకిన వ్యక్తిని వివక్షకు గురిచేయరాదని, హెచ్‌.ఐ.వి సోకిన ప్రతి వ్యక్తికి ఏ.ఆర్‌.టి సెంటరులో ఉచితంగా మందులు ఇస్తారని వాటి ద్వారా వారియొక్క జీవిత కాలాన్ని పొడిగించుకునే వీలుందని ఈ వీధి నాటక రూపంలో వెంకటేష్‌ ,శ్రీనివాస్‌ కళాబృందం వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిడ్స్‌ సిబ్బంది విజయ భాస్కర్‌, శంషాద్‌ , శకుంతల, అనిల కుమారి,అలివేలు, షేక్షా, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img