Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మళ్లీ కరోనా వస్తోంది.. అప్రమత్తంగా ఉండండి : జెడ్పీటీసీ పసుపుల హేమావతి

విశాలాంధ్ర -రాప్తాడు : మహమ్మారి కరోనా వైరస్‌ మూడోసారి తన ప్రతాపం చూపించేందుకు భయపెడుతోందని గ్రామీణ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జెడ్పీటీసీ పసుపుల హేమావతి సూచించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ స్పెషల్‌ క్యాంప్‌ లో భాగంగా శుక్రవారం హంపాపురం సమీపంలోని ఎస్‌ వీఐటీ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు మరూరులో ర్యాలీ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా నుంచి రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించడంతోపాటు శానిటైజర్లను ఉపయోగించడమే ఏకైక మార్గమన్నారు. ఎవరికి వారు స్వీయ రక్షణ పాటించడం ద్వారా కరోనాకు దూరంగా ఉండవచ్చన్నారు. అదేవిధంగా మొక్కలు నాటడం వలన ప్రయోజనాలతోపాటు పర్యావరణ పరిరక్షణ గురించి కూడా వివరించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్‌ వీ.బీ.ఆర్‌.శర్మ , చైర్మన్‌ బీ.వీ.క్రిష్ణారెడ్డి, వైస్‌ చైర్మన్‌ వెన్నెపూస రవీంద్రరెడ్డి, సీ.ఈ.ఓ ఆనంద్‌ కుమార్‌ గారు ,ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.సూర్యశేఖర రెడ్డి, గ్రామ సర్పంచ్‌ నారాయణ స్వామి, ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ ఎం. శ్రీనివాసులు నాయక్‌, పీడీ ఎం. రమేష్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img