Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ధర్నా

విశాలాంధ్ర-తాడిపత్రి: మున్సిపల్ కార్మికుల సమస్య లను పరిష్కరించాలని సిఐటియు పట్టణ అధ్యక్షుడు డి.రామాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం నుండి కొత్త మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ పట్టణానికి సంబంధించి గతంలో ఉన్న కార్మికులే పట్టణమంతా పనిచేయుచున్నారు. వారికి పని భారం ఎక్కువైందన్నారు. ప్రస్తుతం 36 వార్డులుగా విభజించారు. వాటిని పరిగణలోకి తీసుకొని జనాభా ప్రాతిపదికన కార్మికులను పెంచాల న్నారు. గత రెండు సంవత్సరా లుగా కార్మికులకు ఇవ్వవలసిన కొబ్బరి నూనె, సబ్బులు, పనిముట్లు, రక్షక కవచాలైన చేతులకు బ్లౌజులు తదితర వాటిని సకాలంలో అందించాలన్నారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్, హెల్త్ కార్డులు మున్సిపల్ కార్మికులకు వర్తింపజేయాలన్నారు. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడు తున్న, మరణించిన కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా వారి కుటుంబంలోని ఒకరికి ఉపాధి కల్పించాలన్నారు. వన్నూరప్ప, నరసింహమూర్తి, బాల పెద్దయ్య ఈశ్వరయ్య కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img