Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కార్మికుల సమస్యల పరిష్కారానికై మాజీ ఎమ్మెల్యే నిరసన

విశాలాంద్ర – కళ్యాణదుర్గం : అనంతపురం జిల్లాలో 9 నియోజకవర్గాలకు తాగునీటి వసతి అందించే శ్రీ సత్య సాయి, శ్రీరాంరెడ్డి తాగునీటి పథకాల్లో పనిచేసే కార్మికులకు వేతనాలు అందక నాలుగు రోజులుగా నిరవదిక సమ్మెకు దిగడంతో వారికి సంఘీభావంగా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి సోమవారం ధర్నాకు దిగారు. మాజీ ఎమ్మెల్యే, ఆయన కుమారుడు మారుతి చౌదరి కళ్యాణదుర్గం లోని శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు వద్ద కార్మికులకు సంఘీభావంగా ధర్నా చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. కార్మికుల వేతనాలు చెల్లించాలని, కాంట్రాక్ట్ విధానం రద్దుచేసి బోర్డు శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, గ్రాటిటీ బోనస్ , పిఎఫ్, ఈఎస్ఐ వెంటనే చెల్లించాలని రెండు నెలలుగా బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలని, పదవీ విరమణ పొందిన కార్మికులు మరణించిన వారి కుటుంబాలకు రాజీనామా చేసిన కుటుంబాలకు గ్రాడ్యుటి వెంటనే చెల్లించాలని విధి నిర్వహణలో కార్మికులు ఏదైనా ప్రమాదం జరిగితే ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు . వీటన్నింటికీ ప్రభుత్వం ఒప్పుకొని కార్మికుల సమస్యలను తీర్చాలని హనుమంతరాయ చౌదరి, మారుతి చౌదరి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పాపం పల్లి రామాంజనేయులు, టిడిపి మండల కన్వీనర్ గోళ్ళ వెంకటేశులు, ఆర్జీ శివశంకర్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి , టిడిపి పట్టణ కన్వీనర్ శర్మాస్ వలి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img