Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కార్మిక, కర్షక, నిరుపేదల ఆశాజ్యోతి సీపీఐ

విశాలాంధ్ర-రాప్తాడు : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) కార్మిక, కర్షక, శ్రామిక, నిరుపేద వర్గాలకు 98ఏళ్లుగా అండగా నిలుస్తోందని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సి.మల్లికార్జున అన్నారు. నియోజకవర్గ కేంద్రం రాప్తాడులో సోమవారం సీపీఐ 98వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మంద5కార్యదర్శి ఆర్‌.రవీంద్ర ఆధ్వర్యంలో పతాకావిష్కరణ చేశారు. ఆవిష్కరించారు. ముఖ్యఅతిథి చిరుతల మల్లికార్జున మాట్లాడుతూ గత 98 ఏళ్లు ప్రజల పక్షాన సీపీఐ అలుపెరుగని పోరాటాలు చేస్తోందన్నారు. బ్రిటిష్‌ పాలకుల నిర్భంధకాండకు, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా 1925 డిసెంబర్‌ 26 న కాన్పూర్‌ (ఉత్తరప్రదేశ్‌ )గడ్డపై ఆవిర్బవించిందన్నారు. మహోన్నత త్యాగాలు, మహత్తర విజయాలకు సిపిఐ ప్రతీకగా నిలిచిందన్నారు. సంపూర్ణ స్వాతంత్య్రం కొరకు పిలుపిచ్చిన పార్టీ -సిపిఐ అని, ప్రస్తుతం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ లు కులం, మతం పేరుతో విభజన రాజకీయాలు చేస్తున్నాయని తరిమికొట్టాల్సిన అవశ్యకత ఉందన్నారు. బీజేపీని సిద్ధాంత పరంగా ఓడిరచే శక్తి కమ్యూనిస్టులకే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఎం చలపతి, శాఖ కార్యదర్శులు మహమ్మద్‌ రఫీ, సంజీవులు, నాయకులు ఎస్‌. భాషా, కాటమయ్య, నారాయణస్వామి, కుళ్లాయప్ప, లక్ష్మీదేవి, సునీత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img