Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కాలేయ వ్యాధిపై ప్రజలు అవగాహనతో ఉండాలి.. ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ఇందు రేఖ.

విశాలాంధ్ర – ధర్మవరం : కాలేయ వ్యాధిపై ప్రజలు తప్పనిసరిగా అవగాహనతో ఉండాలని, అప్పుడే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఇందు రేఖ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం అంతర్జాతీయ కాలేయ దినోత్సవ(లివర్ డే) సందర్భంగా రోగులకు, ప్రజలకు అవగాహన విషయములో పలు విషయాలను తెలియజేశారు. అనంతరం డాక్టర్ ఇందురేఖ మాట్లాడుతూ ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, నీరసం, కామెర్లు రావడం, కడుపులో వాపు రావడం మోషన్స్ లో రక్తం రావడం లాంటివి కాలేయ వ్యాధి లక్షణాలని తెలిపారు. మద్యపానం సేవించిన వారికి, సన్నగా ఉండు వారికి కొన్ని వైరస్ వ్యాధుల వల్ల కొన్ని రకాల మందులు వాడటం వలన కూడా ఈ వ్యాధి సోకుతుందని తెలిపారు. మద్యపానం సేవించిన, సేవించక పోయినా లక్షణాల ప్రకారం వ్యాధి వస్తుందన్నారు. కాలేయం పట్ల తగిన జాగ్రత్తలను అవగాహనతోనే సాధ్యమైతుందని తెలిపారు. కాలేయ సమస్యను ముందుగానే గుర్తించితే ప్రమాదం ఉండదని తెలియజేశారు. ప్రతి సంవత్సరము తప్పనిసరిగా కాలేయము (లివర్) యొక్క పరీక్షలను చేయించుకోవాలన్నారు. మానవ శరీరంలో రెండవ అతిపెద్ద అత్యంత కీలకమైన అవయం లివర్ అయినందున, ఆ లివరే జీవక్రియ జీర్ణ క్రియ రోగ నిరోధక శక్తి టాక్సిన్స్ వడబోతా విటమిన్లు ఖనిజాలు గ్లూకోస్ మొదలైన వాటి నిల్వకు మాత్రమే పరిమితం కాకుండా అనేక విధులను నిర్వర్తిస్తుందని తెలిపారు. ప్రతి జబ్బుకు సొంత వైద్యం పనికిరాదని తెలిపారు. కావున ప్రజలందరూ గమనించి కాలేయ వ్యాధిపై అవగాహన ఉన్నప్పుడే అందరికీ ఆరోగ్యకరమైన జీవితం లభిస్తుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img