Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

కుప్ప కూలిన పెన్నాహోబిలం శ్రీలక్ష్మి నరసింహస్వామి రథం

అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు

విశాలాంధ్ర- ఉరవకొండ : అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథం శనివారం మరమ్మత్తులు చేస్తుండగా ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. మే రెండవ తేదీ నుంచి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి.మే 10వ తేదీన బ్రహ్మ రథోత్సవం లాగుడు కార్యక్రమం జరగాల్సి ఉంది. ఇంతలో ఈ సంఘటన జరగడం పట్ల భక్తులు అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 400 సంవత్సరాల క్రితం తయారుచేసిన ఈ రథం శిథిలావస్థకు చేరుకున్నదని కొత్త రథం తయారు చేయాలని భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయ అధికారులకు విరాళాలు కూడా అందజేశారు. గత మూడు సంవత్సరాలుగా భక్తులు దాదాపు 76 లక్షల రూపాయలను రథం యొక్క నిర్మాణానికి విరాళాలను అందజేసినప్పటికీ కొత్త రథం తయారు చేయడంలో అధికారులు జాప్యం కాలయాపన చేస్తున్నడం పట్ల భక్తులు ఆగ్రహాలను వ్యక్తం చేస్తున్నారు. శనివారం రోజు కూడా ఎలాంటి టెక్నికల్ యొక్క అధికారులు సహకారం లేకుండానే కొంతమంది స్థానిక కార్పెంటర్లతో క్రేన్లు సహాయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా మరమ్మత్తులు చేయడం వల్ల ఈ సంఘటన జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెన్నహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తుల నుంచి ఆదాయం రావడమే కాకుండా దాదాపు 2134 ఎకరాలు భూమిని కూడా కలిగి ఉంది. ఈ భూముల యొక్క లీజు దారుల నుంచి సంవత్సరానికి 40 లక్షల రూపాయలు కూడా ఆదాయం వస్తుంది.అంతేకాకుండా సంవత్సరానికి హుండీ ద్వారా కోటి రూపాయలు ఆదాయం వస్తుంది.పెన్నాహోబిలం లక్ష్మీనరసింహస్వామిని ఆంధ్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలలో కూడా లక్షలాదిమంది భక్తులు ఇంటి దైవంగా పూజిస్తారు. ఇంత పెద్ద ఎత్తున భక్తులను, ఆదాయ వనరులు కలిగివున్న ఈ దేవాలయానికి నూతన రథం తయారు చేయించడంలో దేవాదాయ శాఖ అధికారులు పూర్తిగా విఫలం చెందినట్లు భక్తులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img