Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

కులాలకతీతంగా పేద ప్రజల సేవే తమ లక్ష్యం

విశాలాంధ్ర-తాడిపత్రి: కులాలకుతీతంగా పేద ప్రజల సేవే తమ లక్ష్యంగా కొనసాగుతామని ఫయాజ్ భాషా సేవ ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఫయాజ్ భాష చెప్పారు. శుక్రవారం పట్టణంలోని అబ్దుల్ కలాం ఆజాద్ షాది ఖానాలో ఫయాజ్ భాష సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టిక ఆహారం పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫయాజ్ భాషా సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఫయాజ్ భాష ప్రభుత్వ ప్రధాన వైద్యురాలు రామలక్ష్మమ్మ, డబ్ల్యూహెచ్వో కన్సల్టెన్సీ డేనియల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ క్షయ వ్యాధి గ్రస్తులు క్షయ వ్యాధి నయం కావాలంటే మందులతోపాటు పౌష్టికాహారం తీసు కోవడం ఎంతో ముఖ్యమని అలాంటి పౌష్టికాహారం పంపిణీ చేయడం ఎంతో గొప్ప విషయం అన్నారు. ఫయాజ్ భాషా ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఫయాజ్ భాష మాట్లాడుతూ కులాలకతీతంగా వడ్డీ లేని రుణాలు, రక్త పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసి కొన్ని పరీక్షలు ఉచితం, కొన్ని పరీక్షలు కనీస చార్జీలతో పరీక్షలు చేస్తున్నామ న్నారు. దాదాపు ఆరు నెలల నుండి దాదాపు పట్టణంలోని 50 మందికి క్షయ వ్యాధి గ్రస్తులకు పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నామన్నారు. రంజాన్ పండుగ అనంతరం దాదాపు 200 మందికి ఇంటి స్థలాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఫయాజ్ భాష సేవా ట్రస్ట్ కొనసాగినన్న రోజులు పేద ప్రజలు కష్టాల్లో ఉన్నారని తనకు తెలిసిన వెంటనే తమ వంతు సహాయంగా చేయూతనందిస్తానని నియోజకవర్గ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సుధాకర్ రెడ్డి, ఈస్దాని వక్ బోర్డు ప్రెసిడెంట్ షాషావలి వైస్ ప్రెసిడెంట్ వై. మహబూబ్ బాషా వైసిపి నాయకులు చవ్వా రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి గురు ప్రసాద్ రెడ్డి అస్లాం, షామీర్, జానీర్, రియాజ్, కొడవండ్లపల్లి వలి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img