Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిరంకుశ పాలనపై నిర్వహించే పాదయాత్రను జయప్రదం చేయండి..

సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్
విశాలాంధ్ర -ధర్మవరం : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిరంకుశ పాలనపై ఁఏప్రిల్ 14 నుండి 31 వరకుఁ నిర్వహించబోయే పాదయాత్రను జయప్రదం చేయాలని శ్రీ సత్య సాయి జిల్లా సిపిఐ కార్యదర్శి వేమయ్య యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో గురువారం నియోజకవర్గస్థాయి ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వేమయ్య యాదవ్ హాజరయ్యారు. ఈ సమావేశం నియోజకవర్గ కార్యదర్శి ముసుకు మధు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా వెమయ్యా యాదవ్ మాట్లాడుతూ బిజెపి కార్పొరేట్ మతోన్మాద విధానాలను ఎండగొట్టేందుకు ప్రజలు సంసిద్ధం కావాలని, బిజెపి ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలను, చట్టాలు, ఆర్థిక విధానాలు, అధిక ధరలు,నిరుద్యోగం,ప్రైవేటికరణ,జీఎస్టీతో భారాలు,మతోన్మాదం,పౌరసత్వం,ఢిల్లీలో దాడులు, మత మార్పిడిలు,మైనార్టీ పై దాడులు,దళితులపై దాడులు,అవినీతి రఫెల్ ఆదాని కుంభకోణం, ఇవన్నీటిపైన బిజెపి ప్రభుత్వంను నిలదీయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం,పోలవరం నిర్వాసితులకు నిధులు ఇవ్వకపోవడం,ప్రత్యేక హోదా,వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజి,పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు, పెంచడంతోపాటు పార్లమెంట్లో వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ చట్టం,విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ,రాజధాని నిర్మాణం,వంటి పరిశ్రమలకు నిధులు ఇవ్వకపోవడం దారుణం కాదా అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదాని కంపెనీలకు రాష్ట్ర వనరులు, సంపద,పరిశ్రమలన్నీ కూడా కట్టబెట్టడం జరుగుతుందిఅని, వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నుండి పూర్తిగా రాష్ట్ర ప్రజలపై ఆర్థిక భారాలు మోపుతూ, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి జే వి రమణ, ముద్దిగుబ్బ వెంకటేష్,సిపిఐ పట్టణ కార్యదర్శి రవి, సహయ కార్యదర్శి రమణ, చేనేత కార్మిక సంఘం నియోజక వర్గ కార్యదర్శి వెంకట నారాయణ, వెంకట స్వామి, సిపిఐ నాయకులు శ్రీధర్, సురేష్ ,రంగయ్య , సీనా, ఆది, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు రాజా ,కుల్లాయప్ప మహిళా సమైక్య పద్మ, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి పోతులయ్య తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img