Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కేడి బ్యాచ్లకి కొమ్ముకాస్తున్న మోడీ

చిరుతల మల్లికార్జున
విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : ఆత్మకూరు మండల వ్యాప్తంగా బి ఆలేరు, సనప ,మదిగుబ్బ, వడ్డిపల్లి, తలుపుూరు, పంపునూరు, ఆత్మకూరు ముట్టాలా గ్రామాలలో ప్రచార బేరి గురువారం కార్యక్రమం చేయడం జరిగింది.దేశ్ కి బచావో ! మోడీకి హటావో !! బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిరంకుశ, మతోన్మాద విధానాలపై సిపిఐ – సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం ఉదయం చుట్టుగుంట విశాలాంధ్ర వద్ద ప్రచార భేరిని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున ప్రారంభించి మాట్లాడుతూ బిజెపి ఎన్నికల వాగ్ధానాలతో అదికారంలోకి వచ్చి కే డీ బ్యాచ్లకు కొమ్ముకాస్తుదేశాన్ని సర్వనాశనం చేస్తుందన్నారు. నీరవ్ మోడీ లలిత్ మోడీ కే డి బ్యాచ్ లకు రాచమర్యదలు చేస్తుందని తెలిపారు. నరేంద్రమోడీ వ్యసాయ రంగానికి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యా రంగాన్ని కషాయానికి అప్పచెప్పరన్నారు. లౌకిక వ్యవస్థ పునాదులు ప్రమాదం కదులుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో జగన్ గన్ కల్చర్, గంజాయి కల్చర్ కొనసాగిస్తున్నారని, అధికారం లోకి వచ్చి 46 నెలలు అయినా హోదా ఉసేలేదని ఏద్దేవా చేసారు. లాండ్, సాండ్, బియ్యం మాఫియాకు కొమ్ముకాస్తున్నరని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విషయంలోనూ కేంద్ర ప్రభుత్వానికి అండగా కాపలా కాస్తుందన్నారు.జగనన్నే మా భవిషత్తు కార్యక్రమం హాస్యాస్పదం అని ఆయన అన్నారు.. జగనే మా దరిద్రం – జగనే మా శని అని పేరు పెట్టడం సబబు అని చిరుతల మల్లికార్జున అన్నారు..
46 నెలల జగన్ పాలనలో దంచుడే దంచుడు – బాదుడే బాదుడు కార్యక్రమం అమలు అయింది. అన్ని వస్తువుల ధరలు, అన్ని ఛార్జీలు, పన్నులు పెరిగాయి అని తెలిపారు.
జగన్ పాలనలో అప్పులే అప్పులు, 4 సంవత్సరాల్లో రూ.7.5 లక్షల కోట్లు అప్పులు అంటూ మండిపడ్డారు..
అరాచకంలో ఆఫ్ఘనిస్తాన్ ను, అప్పుల్లో శ్రీలంకను ఆంద్రప్రదేశ్ దాటిపోయిందని అన్నారు..
జగన్ పాలనలో గన్ కల్చర్, గంజాయి కల్చర్ పెట్రేగి పోతున్నాయని ఆఏదన వ్యక్తం చేశారు..లాండ్, శాండ్, వైన్, మైన్, ఎర్రచందనం, బియ్యం మాఫియాలు చెలరేగిపోయాయి.. రాజధాని లేని రాష్ట్రం అయింది అని ఆవేదన వ్యక్తం చేశారు.. మూడు రాజధానులు అంటూ మూడు ప్రాంతాల ప్రజలను ఆయోమయానికి గురిచేస్తున్నారని చిరతల మల్లికార్జున ఎద్దేవా చేశారు..
వరప్రసాదిని పోలవరం ప్రశ్నార్థక మయింది అని సంజీవిని లాంటి ప్రత్యేక హోదా వూసే లేదని ఆయన గుర్తు చేశారు..నవరత్నాలు నకిలీ రత్నాలు అయ్యాయని ఎద్దేవా చేశారు.. మాట తప్పడం జగన్ దిన చర్య అయిందని ఆరోపించారు. ప్రధాని మోదీ నన్ను నమ్మండి నల్లధనం వెనక్కు తెస్తా అన్నారు.. నిరుద్యోగం అంతం చేస్తా అన్నారు..నోట్లు రద్దుతో ఉగ్రవాదం అంతం అని పిలుపునిచ్చారు..(పుల్వామా ఎలా జరిగింది? కరెక్ట్ గా ఎన్నికల ముందే) సర్జికల్ స్ట్రైక్ తరువాత ఉగ్రవాదం వుండదు అన్నారు.. జి ఎస్ టి తో అద్బుతం జరుగుతుంది ధరలు తగ్గుతాయని నమ్మించాడు..
370 రద్దు తరువాత కాశ్మీర్ ప్రశాంతం గా వుంటుంది అని సి ఏ బి దేశానికి మంచిది అన్నారు. 21 రోజులు ఇంట్లో వుండండి కరొన పూర్తిగా పోతుందని మరోసారీ మోసం చేశారు.. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మితెనే దేశం బాగుపడుతుందని తెలిపారు.. విద్యుత్ బిల్ రైతుకు మంచిది అని అగ్రో బిల్ రైతుకు చాలా మంచిదని అగ్ని వీర్ మంచిదని దేశ ప్రజలను మోసం చేశారు‌‌
2023 లో బీబీసీ ప్రచారం తప్పు.హిడెన్బర్గ్ చెప్పింది తప్పు. ఆదానీ 12 లక్షలకోట్లు స్కాం ఉత్తుత్తే.
నాకు ఆదానీ మిత్రుడే కాదు. నేను ,ఆదానీ మాత్రం పవిత్రులమే అని చెప్పడం ద్వారా మోదీ నమ్మొచ్చా అని ఆయన చిరుతల మల్లికార్జున ప్రశ్నించారు
సిపిఐ రాప్తాడు నియోజకవర్గం కార్యదర్శి రామకృష్ణ కరోనా పోయింది కానీ, అతి ప్రమాద కరమైన నరేంద్ర మోడీని గద్దె దింపాలన్నారు. మాట్లాడుతూ 9 సంవత్సరాల అధికారంలో కేంద్రం, 4 సంవత్సరాల అధికారంలో రాష్ట్రం రెండూ ప్రజలపై భారాలు వేస్తున్నాయి. బ్యాంకులను ప్రైవేటుపరం చేస్తున్నాయన్నారు. యువతని ఉద్యోగాలు ఇస్తానని మోసం చేస్తున్నారని అవేదన వ్యక్తం పరిచారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, విమానయానం ప్రవిటీకరణ చేస్తున్నారని తెలిపారు. ప్రజలపై పన్నుల భారాలకు వ్యతిరేఖంగా స్పందించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచటంలో పోటీ పడుతున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఆత్మకూరు మండల కార్యదర్శి సనప నీళ్లపాల రామకృష్ష, సిపిఐ రాప్తాడు నియోజకవర్గ సహాయ కార్యదర్శి జి శ్రీకాంత్ రాప్తాడు నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు చలపతి, వెంకటనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బి. రామాంజనేయులు యువజన నాయకులు ధనంజయ, రెడ్డప్ప భాష మహిళా సమాఖ్య నాయకురాలు నల్లమ్మ , ముత్యాలప్ప, గోపాల్ నాయక్, సిపిఎం నాయకులు శివశంకర, రామయ్య, సిపిఎం మండల నాయకురాలు సరస్వతి జయమ్మ వలి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img